You are here
Home > Stories > అరవింద్- అనిషా

అరవింద్- అనిషా

aravind_anisha

                                                                    అరవింద్- అనిషా    

 

తాను చెయ్య చాపింది ,నా దగ్గరున్న పెన్ తో తన చేతి మీద నా మొబైల్ నంబర్ రాసాను ….రాస్తున్నానే గాని లోలోపల చిన్న భయం తన చెయ్యి కందిపోతుందేమో అనిపించింది …..జల్సా మూవీ లో ఇలియాన లా కళ్ళతో ఒక నవ్వు విసిరింది….ఇంతలో

అరవింద్ !!! అరవింద్ !!!!

 

అరవింద్ వాళ్ళ అమ్మ అరుపులకి అరవింద్ నిద్ర లేచాడు చుట్టూ చూసుకున్నాడు  .టైము చూస్తే పది అయ్యింది .బద్దకం గా వొళ్ళు విరిచి తన ఫోన్ అందుకు

న్నాడు . తన క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే ఆరోజు వాళ్ళు కాలేజ్ బంక్ ప్లాన్ చేశారు . హమ్మయ్య ఒక పీడ విరగడ అయ్యింది అనుకోని వాళ్ళ అమ్మకి తనకి ఇష్టమైన బిరియాని  చెయ్యమని అడిగేడు .కానీ వాళ్ళ అమ్మగారు ఆ రోజు సాయి బాబా పుట్టిన రోజు అని గుడికి వెళ్లి అన్నదానం దగ్గర తినమన్నారు .

 

అరవింద్ కి గుడి లో అన్నదానం అనగానే పౌరుషం వచ్చి ఇంట్లో నుండి బైటకు వచ్చేసాడు . బస్ స్టాండ్ దగ్గర టొమాటో రైస్ బాగుంటాది అని అటువైపు వెళ్తుండగా వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ  అటువైపు నుండి వస్తూ అరవింద్ ని కలిసాడు .

 

అరవింద్ – ఏ రా ఇటు వైపు వచ్చావ్ ? మీ ఇల్లు ఇటు కాదు కదా..

 

కృష్ణ – ఇక్కడ దగ్గరలో సాయి బాబా గుడి ఉంది కదా రా .ఈ రోజు అన్న దానం కార్యక్రమం ఉంది ,ప్రసాదం అద్భుతం గా ఉంది అని మా వీధి లో వాళ్ళు అనుకుంటే విని వచ్చా .

 

అరవింద్ – ఛీ కక్కుర్తి వెదవ ప్రసాదం కోసం గుడికి వెళ్తావా!!!

 

కృష్ణ: కక్కుర్తి కాదు రా…అద్భుతం గా ఉంది !!! నెయ్యి ,జీడిపప్పు , బాదంపప్పు, కిస్మిస్ దట్టించి చేసారు చెక్కర పొంగలి అన్నాడు

కృష్ణ మాటలకి అరవింద్ కి నోరు ఊరింది, పనుందని చెప్పి గుడికి వెళ్ళాడు .

 

ఇక్కడి నుండి అరవింద్ మాటల్లో……..

 

గుడిబయట చెప్పులు గుట్టలుగా పడి ఉన్నాయి……

 

వామ్మో ఇన్ని చెప్పులు ఉన్నాయేంటీర బాబోయి…ఈరోజు ఇంటికి వెళ్ళినట్టే అనుకోని కాళ్ళు కడుక్కొని  గుడి లోపలికి వెళ్ళాను ……

 

గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ రోజు గుంటూరు టాకీస్ థియేటర్ లా కనిపించింది ..ప్రసాదాన్ని తలుచుకుంటూ లైన్ లో నిల్చున్నాను .ప్రసాదానికి టోకెన్ తీసుకోవాలని ముందున్న ఎర్ర చొక్కా అంకుల్ చెపితే లెఫ్ట్ సైడ్ లో ఉన్న కౌంటర్ కి వెళ్ళాను…

 

చైనీస్ హ్యాంగింగ్ బెల్స్ సౌండ్ వస్తే కౌంటర్ లోకి చూసా ,

అప్పుడే మానిక్యూర్ చేసిన చేతులు …బంగారం రంగు గాజులు …నైల్ ఆర్ట్ వేసిన గోర్లు ..ఆ గోర్లు చూడగానే గుచ్చు కున్న ఫీలింగ్ వచ్చింది …అలా కళ్ళు పైకి ఎత్తి తన మొహం చూసా . జెంటిల్ మ్యాన్ సినిమా లో niveda  thomas  లా ఉంది ..తనని ఎక్కడో చూసినట్టు అనిపించింది .వెనుక ఉన్న వాళ్ళు అరుస్తున్నారు అని లైన్ లో నుండి బైటకు వచ్చేసా ..అక్కడ ఒక ముసలామె ఉంది నా టోకెన్ ఆమెకి ఇచ్చి నేను మళ్ళీ కౌంటర్ దగ్గరకి వెళ్ళా తనని మళ్ళీ చూడాలి అనిపించి ..టోకెన్ ఆల్రెడీ తీసుకున్నారు కదా అని అడిగింది ,ముసలామెకి ఇచ్చాను అని చెప్పా .సడెన్ గా ఒక మెరుపు కనిపించింది ,నవ్వింది ..ఇది ఏదో వర్క్ ఔట్ అయ్యేలా ఉంది అనిపించింది ..

 

ఆ టోకెన్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తన దగ్గరకి వెళ్ళాను ..ఈసారి వెటకారం గా ఒక చూపు చూసింది నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు అన్నట్టు ;దొరికిపోయాను .ఏది అయితే అది అయ్యింది అని మళ్ళా వెళ్ళాను కౌంటర్ దగ్గరకి ,కౌంటర్ కట్టేసి ఉంది .ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చుట్టూ చూసాను తాను కనపడలేదు .పిల్ల కోసం ప్రసాదం వదిలేసాను ఇప్పుడు తిండి సంగతి ఏంటా అని అయోమయం లో పడ్డాను ..ఇందాక వినపడిన చైనీస్ బెల్స్ సౌండ్ మళ్ళీ వినిపించింది వెనక్కి తిరిగి చూసా తాను ఎదురుగా నన్ను చూసి నవ్వుతోంది ;తనకి అర్థం అయ్యింది నేను తనని వెతుకుతున్నాను అని నాకు అర్థం అయ్యింది నేను red  handed  గా దొరికిపోయాను అని.తాను నా దగ్గరకి వచ్చి ఒక టోకెన్ ఇచ్చి వెళ్ళిపోయింది వెనుక నుండి తనని చూస్తున్న తాను నవ్వుతుంది అనిపించింది .

 

తాను ఇచ్చిన టోకెన్ నుండి lavender  smell  వస్తుంది .ఆ టోకెన్ తీసుకొని నేను భోజనానికి వెళ్ళాను .కూర్చోగానే కృష్ణ గాడు చెప్పిన చెక్కర పొంగలి గుర్తు వచ్చింది .నేను దానికోసం వైట్ చేస్తుంటే టోకెన్ నుండి వచ్చిన lavender smell  నా వెనుక వైపు నుండి వచ్చింది .నేను వెనక్కు తిరిగి చూసా తాను గారెలు వడ్డిస్తూ నా వైపు వస్తుంది .నా ఆకు లో చక్ర పొంగలి వేశారు తన్ను వచ్చి రెండు గారెలు వేసింది . ఒకటి చాలు అన్నాను ,పర్లేదు వేసుకో తిరిగి తిరిగి అలసిపోయివుంటావ్ అంది .నేను చక్రపొంగలి తినబోయే ముందు తనవేపు చూసా .నేను పెట్టింది ముందు తింటాడా తనకు నచ్చింది ముందు తింటాడా అన్నట్టు చూసింది .నాకు షారుక్ ఖాన్ మూవీ కి సల్మాన్ మూవీ కి ఒకే సారీ టిక్కెట్ దొరికినట్టు అనిపించింది .నిన్నేం తింటేనా అని తాను వెయిట్ చేస్తుంది .నేను గారే ముక్క చిదిపి దానిని చక్కరపొంగలితో తింటూ తనవేపు ఒక దొంగ చూపు చూసా .తాను నవ్వుతూ మిగిలిన వాళ్ళకి వడ్డిస్తూ వెల్లిపొఇంది .నా భోజనం ఫస్ట్ గా ఫినిష్ చేసుకొని తనకోసం వెతికాను తాను చెప్పులు స్టాండ్ దగ్గర కనపడింది .నేను చెప్పుల స్టాండ్ దగ్గరకు వెళ్లే సరికి తన రోడ్డు మీద ఎవరో బైక్ పై కనిపించింది పరిగ్గుతుకొని కరౌడ్ ని నెట్టియూకుంటూ బయటకు వేళ్ళ అప్పటికే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు .బైక్ మీద ఒక సైడ్ తిరిగి కూర్చుంది .నేను తననే చూస్తున్న .తాప్పక వెళ్ళిపోతున్నట్టు  నా వైపు చూసింది .

 

నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు .తనని వదలాలని లేదు ఏదో ఐపోతుంది నాకు ఎలాగైనా తనని కలవాలి ఇది ప్రేమ లేక ఆకర్షణ నాకు తెలియట్లేదు కానీ నేను తనని కలవాలని ఫిక్స ఐపోయాను కానీ ఎలా !!.కళ్ళు మూసుకొని తననే గుర్తు తెచ్చుకున్నా ..తాను వేసుకున్న డ్రెస్ తన ear  rings ,necklace , ID CARD , Yahooo !!!!!! తాను వేసుకున్న ID ఒక కాలేజ్ ది .అది అక్కడికి కొంచం దూరం లో ఉన్న ఒక womens  college .

 

పొద్దున్నే లేచి ఆ కాలేజ్ డిటైల్స్ నెట్ లో వెతికేను అడ్రస్ దొరికింది .ఎప్పుడు సాయంత్రం అవుతాద అని ప్రతి క్షణం ఎదురు చూసా .సాయంత్రం వాళ్ళ కాలేజ్ వదిలే టైం కి ఒక 15 min  ముందు అక్కడికి వెళ్ళాను .ఎదురుగా ఉన్న జ్యూస్ సెంటర్ లో ఒక జ్యూస్ తాగి వాళ్ళ కోసం వైట్ చేస్తున్న .తాను ఈరోజు వచ్చిందా లేక మళ్ళీ గుడికి వెళ్లిందా ఇలా చాలా doubts !!

 

తాను రానే వచ్చింది పక్కన 3  ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని చూస్తే గుర్తు వచ్చింది వాళ్ళు కూడా నిన్న గుడికి వచ్చారు .నేను వెళ్లి తన ఎదురుగా నిలబడ్డ .నన్ను చూసి తాను Shock అయింది తేరుకొని నవ్వుతుంది తన కళ్ళల్లో ఆనందం కనపడుతుంది నాకు .కాలేజ్ పక్కనే bustop ,కానీ వాళ్ళు వేరేవైపు వెళ్లారు నేను వాళ్ళని follow  అయ్యాను .ఒక చెట్టు వెనకకు చేరాం అందరం .నేను ధైర్యమ్ చేసి ని పేరు ఏంటి అని అడిగాను .

తాను : ఎందుకు ?

నేను: ఊరికే !! నిన్న టోకెన్ ఇచ్చావ్ కదా థాంక్స్ చెపుదామని ..

తాను: bus  లో conductor కూడా ticket  ఇస్తాడు వాడికి కూడా థాంక్స్ చెప్తావా ??

నేను: Beauty  with Brain  అన్నాను.

 

తాను నవ్వుకొని  ANISHA అని చెప్పింది .నాకు తెలుసు అన్నాను ఎలా అన్నది ID CARD వైపు చూపించా.వెంటనే తన నంబర్ అడిగెను .ఇవ్వను అన్నది .నేను request చేద్దాం అనుకున్న కానీ వొద్దు అనుకోని bye  చెప్పేశా తనకి .

తన కళ్ళు ఎర్రగా ఐపోయి నీళ్లు వస్తున్నాయి .నేను కంగారు పడ్డాను ,తాను కళ్ళు తుడుచుకొని

తాను:నాకు ఒక బావ ఉన్నాడు ఇంట్లో తనకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు అన్నది.

నేను : పెళ్లి ఇంకా అవ్వలేదు గా అన్నాను .

తాను:వాడు మంచివాడు కాదు రోజు నన్ను drop  చేసి pick -యూపీ చేసుకునేది వాడే .

 

నాకు ఏమి అనాలో అర్థం కాలేదు .నేను అంటే ఇష్టం ఉందా అని అడిగెను .

తాను ఏమి మాట్లాడలేదు ,నేను వెళ్ళిపోదాం అనుకున్న కానీ తనని వదిలి వెళ్లలేక పోతున్న .

 

 

ఇంతలో వాళ్ళ బావ రావటం తో తాను పరిగెత్తి వెళ్ళిపోయింది .చేసేది ఏమి లేక నేను ఇంటికి వెళ్ళిపోయాను .బైటకి నవ్వుతున్నాను కానీ లోపల ఏడుపు వస్తుంది .మరుసటి రోజు మళ్ళీ అదేటైం కి వెళ్ళాను .ఈరోజు తాను నవ్వుతుంది ,వాళ్ళ బావ ఈరోజు ఊరిలో లేడు అంట.Ice  cream తింటావా అని అడిగెను ,వద్దు అన్నది .నీతో మాట్లాడాలి అన్నాను చెప్పు అన్నది .

 

నేను  I LOVE YOU అన్నాను .

తాను సిగ్గుపడి వొద్దు అన్నది .ఏమి అని అడిగెను ,మా ఇంట్లో ఒప్పుకోరు మా బావకి తెలిస్తే గొడవ చేస్తాడు అన్నది . నేను మీ బావ ని పెళ్లి చేసుకోను అన్నాను .తాను నవ్వింది . ఆ నవ్వు లో తన   ఇష్టం తెలుస్తుంది .నేను తన చెయ్యి పట్టుకున్నాను ,ఒక్కసారి లాగేసుకుంది ;రోడ్డు మీద ఏమిటి ఈ వేషాలు అన్నది .పోనీ రోడ్డు పక్కకి పాద అన్నాను .దీనికి ఏమి తక్కువ లెదు అన్నది నవ్వుతూ .

 

నేను తన NUMBER మళ్ళీ అడిగెను ,అడ్డంగా తల ఉపింది .నాకు కొంచం మండింది కానీ కంట్రోల్ చేసుకున్నాను .అప్పుడు తాను NUMBER  ఇవ్వను అన్నాను కానీ తీసుకోను  అనలేదు అన్నది .నేను నవ్వుతూ నాకు రింగ్ ఇవ్వు అన్నాను .నో NUMBER రాసి ఇవ్వు అన్నది .పేపర్ ఉన్నద అని అడిగెను .లేదు అన్నది ,మరి ఎలా రాయాలి అన్నాను .చూస్తే కనిపించే లా రాసి ఇవ్వు అంది .నాకు తట్టలేదు .తను నా తల మీద ఒకటి కొట్టి చెయ్యి చాపింది .నేను కళ్ళు పెద్దవి చేస్తూ పట్టుకో మని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అన్నాను.తాను అమ్మాయిలు అన్ని చెప్పారు అర్థం చేసుకోవాలి అన్నది .

 

అప్పుడు గుర్తు వచ్చింది నాకు వచ్చిన కల ఈ అమ్మాయే ..చేతిమీద NUMBER  రాయటం ,తాను నవ్వటం అన్ని సినిమా చూసినట్టు ఉంది నాకు.తరువాత తాను bus ఎక్కి వెళ్ళిపోయింది .3 days వాళ్ళ కాలేజ్ సెలవు .తాను నాకు ఫోన్ చెయ్యలేదు .ONE fine  day .Morning 6 కి తాను ఫోన్ చేసింది .సాయి బాబా గుడికి రమ్మని చెప్పి cut చేసింది.

 

నేను త్వరగా రెడీ అయ్యి 10 min  లో గుడికి వెళ్లెను.తాను అప్పటికే గుడి దగ్గర ఉంది .మేము మాట్లాడిన రోజు వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి ఇంట్లో చెప్పేరు అంట స్కూల్ ఫ్రెండ్ అని చెప్పిన నమ్మలేదు అంట ఇంట్లో వాళ్ళు .Next  month తన పెళ్లి ఫిక్స చేసేసారట ,ఏడుస్తూ చెప్పింది .నేను తనని ఉరుకోబెట్టేను కానీ తాను ఏడుపు ఆపలేదు .

నేను గుడికి వచ్చిన రోజు తాను నన్ను చూసి నాకోసం కౌంటర్ దగ్గర కూర్చుందంటే .నాకోసమే వడ్డించడానికి వచ్చిందంటే .తనని పెళ్లి చేసుకొని ఎక్కడికైనా తీస్కెల్లిపో అన్నది కానీ నేను ఆ పని చేయలేను ,కారణం నాకు ఇంకా ఉద్యోగం లెదు ,అక్క పెళ్లి అవ్వలేదు ,నేను చేసుకోలేను అని చెప్పేశా .తాను ఇంకా ఏడ్చింది .తన బాగ్ లో నుండి రెండు రింగ్స్ తీసింది .అవి బాబా దగ్గర అప్పటికే పూజ చేసి ఉన్నాయి .తాను నాకు ఒక రింగ్ పెట్టి నన్ను తనకి రింగ్ పెట్టమన్నది .మన ఇద్దరం ఒకరికి ఒకరు గుర్తు ఉండాలి అని ఆ రింగ్స్ మీద A  అని   లెటర్ వేయించా అన్నది. నేను అక్కడే ఏడ్చేసా ,తాను ఇంకా నన్ను కలవదు అని అర్ధం ఐపోయింది నాకు .ఈరోజు కాలేజ్ కి అని చెప్పి వచ్చింది అంట ,రోజంతా తనతో ఉండమని అడిగింది ,నేను సరే అన్నాను .టిఫిన్ చేసి సినిమా కి వెళ్ళేము .సినిమా అంతా తాను నా చెయ్యి వదల లెదు ,నాకు కూడా తనని వదలాలి అనిపించలేదు ఒక రోజుకే ఇంత ప్రేమ అనుకొన్న ,తాను ఉంటే చాలు అనిపించింది ,సాయంత్రం తాను వెళ్లిపోయేటపుడు చాలా ఏడ్చింది ,వెళ్ళిపోతూ వెనక్కు వచ్చి నా నుదిటి పై ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది .మళ్ళీ తాను నాకు కనపడలేదు ,వాళ్ల ఫ్రెండ్స్ ని అడిగితే తనకి పెళ్లి ఇయిపోయింది అని చెప్పేరు.

 

——–10 years  తరవాత———

 

ఒక రోజు అనిషా నన్ను నిద్ర లేపింది ..ఆ రోజు sunday తనని సినిమా కి తీసుకెళ్ల మని అల్లరి పెడుతుంది .ఇంతలో మా ఆవిడ కాఫీ పట్టుకొని వచ్చి కన్న కూతురు  రెండు రోజుల నుండి సినిమా కి తీసుకెళ్లమంటే  అంతా పని  ఏంటి  ఇప్పుడు అన్నది . సరే  అని చెప్పి ఆ రోజు మాటినీ కి టికెట్స్ తీసి వాళ్ళని సినిమా కి తీసుకెళ్లాడు .interval  లో కూతురికి popcorn కొనిద్దాం అని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు .వస్తుండగా అక్కడ ఒక చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు ,అరవింద్ ఆ బాబు దగ్గరకు వెళ్లి ని పేరు ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేడు .

 

ఆ బాబు మా ముమ్మీ తప్పిపోయింది అని చెప్పగానే అరవింద్ కి నవ్వు వచ్చేసింది ,ని పేరు ఏంటి అని అడగ గానే తాను అరవింద్ అన్నాడు .అరవింద్ లో లోపల నవ్వుకొని ఆ బాబు వాళ్ళ ముమ్మీ ని వెతుకుతున్నాడు .ఇంతలో అరవింద్ అరవింద్ అనే పిలుపు ,అరవింద్ కి ఆ గొంతు విన్నట్టు అనిపించి తిరిగి చూసాడు ,ఎదురుగా అనిషా ….తనవైపే వస్తుంది అరవింద్ కి షాక్ తిన్నట్టు గా ఉంది ,తన కాళ్ళను తానే నమ్మలేకపొతున్నారు .

 

అనిషా పరిగెత్తు కుంటూ వచ్చి తన దగ్గర ఉన్న చిన్న బాబు ని ఎత్తుకొని ,ఏడుస్తూ అరవింద్ వైపు చూసి షాక్ అయ్యింది .ఆ బాబు తన కొడుకు అరవింద్ ……

 

-నవీన్  & సురేష్

*********************సమాప్తం********************

15 thoughts on “అరవింద్- అనిషా

  1. Really I like it……it’s a great trial n we need more stories n finally u ppl have beautiful hearts ‍‍‍

  2. Really I like it……it’s a great trial we need more stories n finally u ppl have beautiful hearts ‍‍‍

    1. thanks for ur review…we thought ds would b d perfect ending for the story…..any way u will get few more stories with in few days as per your taste….

  3. Heart touching story…each and every line has a lovely feeling in it..all the best..expecting more such stories from u..

Leave a Reply

Top